- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేం అలా అనలేదు.. అంగన్‌వాడీ జీతాలపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో అంగన్‌వాడీ వర్కర్స్ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తమ సమస్యలు పరిష్కరించాలంటూ 18 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయితే మంత్రి బొత్స స్పందించారు. అంగన్‌వాడీలకు సంబంధించి ఇప్పటికే 10 డిమాండ్లు నెరవేర్చామని స్పష్టం చేశారు. విజయనగరంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ జీతాల పెంచుతామని తాము చెప్పలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్‌వాడీలకు రూ. 1000 పెంచుతామని చెప్పామని.. మొదటి ఏడాదిలోనే అంగన్‌వాడీ జీతాలను రూ.11 వేలు చేశామని తెలిపారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తుందన్నందున అర్థం చేసుకోవాలని సూచించారు. వైసీపీ హామీలపై టీడీపీ నేతల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై చర్చలు జరుగుతున్నాయని, రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పారు. ఎన్నికలకు ముందు ఏ పార్టీలోనైనా మార్పులు, చేర్పులు సహజమని మంత్రి బొత్స పేర్కొన్నారు.