రాజీనామా చేసిన వాలంటీర్లకు బిగ్ షాక్.. మంత్రి బాల వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు

by Satheesh |
రాజీనామా చేసిన వాలంటీర్లకు బిగ్ షాక్.. మంత్రి బాల వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి షాకింగ్ న్యూస్ చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు. కానీ ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోబోమని మంత్రి తేల్చి చెప్పారు. రిజైన్ చేయకుండా ఉద్యోగంలో ఉన్న వాలంటీర్లతో పని చేయించుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు కొందరు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని పలువురు వాలంటీర్లు చెబుతున్నారని, వారి విషయంలో ఏం చేయాలో నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎలక్షన్ కోడ్ ముగియడంతో ఇక నుండి ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి పెన్షన్లు, రేషన్ సరుకులు ఇస్తారని చెప్పారు. కాగా, ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లకు ఎటువంటి బాధ్యతలు అప్పగించవద్దని ఆదేశించింది.

టీడీపీ ఫిర్యాదుతోనే ఈసీ అంక్షలు విధించిందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తోందని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈసీ అంక్షలు విధించడంతో పలువురు వాలంటీర్లు పదవులకు రాజీనామాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికల సమయంలో పదవులు వదులుకున్న వారిని విధుల్లోకి తీసుకోవద్దని నిర్ణయించింది. రాజీనామా చేసిన వాలంటీర్లు వైసీపీ సానుభూతిపరులనే ఆరోపణల నేపథ్యంలో వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొవద్దని ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. తమ చేత అప్పుడు బలవంతంగా రాజీనామా చేయించారని పలువురు వాలంటీర్లు అంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read More..

ప్రకాశం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్మా జీ మంత్రి శిద్దా రాఘవరావు గుడ్ బై

Advertisement

Next Story

Most Viewed