- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం.. మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ(Bird Flu) వైరస్ విజృంభించడంతో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాధి మనుషులకు కూడా సోకుతుందనే వదంతలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. బర్డ్ ఫ్లూ వైరస్‌పై సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu)తో పాటు పశుసంవర్థక శాఖ అధికారులు సైతం పాల్గొన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి కోళ్లు చనిపోయిన విషయం, వైరస్ నిర్ధారణ అయిన విషయాన్ని చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చెన్న దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. రెండు గ్రామాల పరిధిలోనే కోళ్లు చనిపోయినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో పటిష్ట నిఘా పెట్టామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ వైరస్‌పై ఆందోళన అవసరం లేదన్నారు. 5 లక్షల కోళ్లు మాత్రమే చనిపోయాయని ఆయన తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగితే బర్డ్ ప్లూ తగ్గిపోతుందని చెప్పారు. బర్డ్ ఫ్లూ నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ‘‘బర్డ్ ఫ్లూపై ఆందోళన వద్దు. చికెన్ తినొచ్చు. రాష్ట్రంలో 10.78 కోట్ల కోళ్లు ఉన్నాయి. సోషల్ మీడియాలో 40 లక్షల కోళ్లు చనిపోయాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ నివారణకు అన్ని చర్యలు తీసుకున్నాం. కోళ్ల నుంచి శాంపిల్స్ తీసుకుని భోపాల్‌కు పంపించాం. బర్డ్ ఫ్లూ వ్యాధి తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.’ అని అచ్చెన్నాయుడు తెలిపారు.