- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మన్యం విడిచి వెళ్లండి.. పాడేరు వైసీపీ ఎమ్మెల్యేకు మావోయిస్టుల బెదిరింపు లేఖ

X
దిశ, వెబ్‌డెస్క్: పాడేరు వైసీపీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మావోయిస్టులు బెదిరింపు లేఖ రాశారు. పార్టీ పదవులకు రాజీనామా చేసి మన్యం విడిచి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. లేకపోతే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలకు పట్టిన గతే పడుతుందని,ప్రజాకోర్టులో ప్రజలు శిక్ష విధిస్తారని హెచ్చరించారు. చాపరాతిపాలెంలో జరుగుతున్న బాక్సైట్ అక్రమ మైనింగ్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చాపరాతిపాలెంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ఖండించాలని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యేకు భద్రతను పెంచే ఆలోచనలో ఉన్నారు.
Next Story