- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manchu Manoj: రాచకొండ సీపీకి రూ.లక్ష బాండ్ సమర్పించిన మంచు మనోజ్
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ రాచకొండ సీపీ కార్యాలయంలో మంచు మనోజ్ విచారణ ముగిసింది. గంటన్నర పాటు మనోజ్‌ను పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ప్రశ్నించి వివరణ తీసుకున్నారు. అనంతరం రాచకొండ సీపీ(Rachakonda CP)కి మంచు మనోజ్ రూ.లక్ష బాండ్ సమర్పించారు. అనంతరం మంచు మోహన్ మోహన్ బాబు(Manchu Mohan Mohan Babu) ఫ్యామిలీ వివాదంలో జరిగిన ఘటనలపై తాను వివరణ ఇచ్చుకున్నారు. తానంతట తాను గొడవలకు దిగనని మనోజ్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించనని చెప్పారు. తన తల్లి ఆస్పత్రిలో లేరని, ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. ఆస్పత్రిలో ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కూర్చుని మాట్లాడుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంచు మనోజ్ పేర్కొన్నారు. తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్త చేశారు. పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉందని తెలిపారు. తామంతా సామరస్యంగా సమస్య పరిష్కరించుకుంటామని చెప్పారు. తన అన్న మంచు విష్ణు(Manchu Vishnu) ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందన్నారు. విద్యానికేతన్ సంస్థల్లో వినయ్ అనే వ్యక్తి అక్రమాలు చేస్తున్నారని, ఈ విషయాలేవి తన తండ్రి మోహన్ బాబుకు తెలియవని చెప్పారు. వినయ్ తమ ఇంట్లో చిచ్చురేపాడని మనోజ్ ఆరోపించారు.
Read More...
నేను లేని సమయంలో గొడవలు జరిగాయి.. మా నాన్న చేసిన తప్పు అదే: Vishnu మంచు