- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వీడిన సస్పెన్స్.. అసలు పోలీసులతో మంచు మనోజ్‌కు గొడవేంటి?

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలోని భాకరాపేట పోలీస్ స్టేషన్(Bhakarapet Police Station)లో ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్(Manchu Manoj ) అర్ధరాత్రి హంగామా సృష్టించారు. సోమవారం తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అనంతరం రాత్రి భాకరాపేట ఘాట్ రోడ్డులో ఉన్న లేక్ వ్యాలీ రిసార్ట్స్(Lake Valley Resort)లో బస చేశారు. సరిగ్గా రాత్రి 11 గంటల సమయంలో పెట్రోలింగ్‌లో భాగంగా పోలీసులు రిసార్ట్ వద్దకు వెళ్లి ఎవరెవరున్నారని విచారించారు. నటుడు మంచు మనోజ్ ఉన్నాడని రిసార్ట్ సిబ్బంది పోలీసులతో చెప్పారు. అదే సమయంలో పోలీసుల వద్దకు వచ్చిన మనోజ్ ఇక్కడికి పోలీసులు ఎందుకు వచ్చారని అడిగారు.
సెలబ్రిటీ అయిన మీరు దట్టమైన అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడం అంత మంచిది కాదని, ఈ ప్రాంతంలో బస చేస్తే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని మనోజ్‌కు చెప్పారు. తన ప్రైవసీకి ఎందుకు భంగం కలిగిస్తున్నారని పోలీసులపై మనోజ్ సీరియస్ అయ్యారు. వాగ్వాదం ముదరడంతో పోలీసులు మనోజ్‌ను భాకరాపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పీఎస్‌కు చేరుకున్న తరువాత మనోజ్ మళ్లీ వాదనకు దిగారు. తనను, తన అనుచరులను తరచూ వేధింపులకు గురి చేస్తున్నారని.. ఇది మంచి పద్దతి కాదని అన్నారు. చివరకు పీఎస్ నుంచి మంచు మనోజ్ రిసార్టుకు తిరిగి వెళ్లిపోయారని తెలియగానే సస్పెన్స్ వీడింది. దీంతో మనోజ్ అభిమానులు, అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు.