దేవర’ మూవీ చూస్తూ వ్యక్తి మృతి

by Y. Venkata Narasimha Reddy |
దేవర’ మూవీ చూస్తూ వ్యక్తి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి చెందిన ఘటన కడపలో చోటుచేసుకుంది. మృతుడిని సీకేదీన్నె మండలం జమాల్‌పల్లికి చెందిన మస్తాన్‌వలిగా గుర్తించారు. ‘దేవర’ సినిమా రిలీజ్ సందర్భంగా కడపలోని అప్సర థియేటర్‌లో అభిమానుల కోసం స్పెషల్ షో వేశారు. స్పెషల్ షోకు వచ్చిన మస్తాన్..మూవీ చూస్తూ ఊహించని విధంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన ఇతర ప్రేక్షకులు వెంటనే అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మస్తాన్‌వలి మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువకరించారు.

మరోవైపు కడపలోనే రాజా థియేటర్లో బెనిఫిట్ షో సందర్భంగా తోపులాట జరిగింది. అభిమానులందరూ ఒక్కసారిగా లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని చక్కబెట్టారు. గురువారం విడుదలైన దేవర మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ల వద్ద హంగామా సృష్టిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed