Vinayaka Chavithi: రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి, బాలుడు మృతి

by srinivas |   ( Updated:2024-09-07 10:07:23.0  )
Vinayaka Chavithi:  రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి, బాలుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: వినాయక చవిత వేడుకల్లో (Vinayaka Chavithi) అపశ్రుతి చోటు చేసుకుంది. వినాయకుడి మండపం ఏర్పాటు చేస్తుండగా ఈర్ల లక్ష్మయ్య అనే వ్యక్తికి కరెంట్ షాక్ (Current Shock) కొట్టింది. దీంతో లక్ష్మయ్య అపస్మార స్థితిలోకి వెళ్లారు. స్థానికులు వెంటనే ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే లక్ష్యయ్య మృతి చెందారు. ఈ ఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్లలో (Muppalla) జరిగింది. అప్పటివరకూ తమతో కలిసి వినాయకుడి మండపం అలంకరణలో పాల్గొన్న లక్ష్మయ్య ఇక లేరని తెలిసి తోటి స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో స్థానికంగా విషాద చాయలు అలముకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లక్ష్మయ్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అటు అన్నమయ్య జిల్లా రాయచోటిలో (Rayachoti) విషాదం చోటు చేసుకుంది. వినాయకుడి మండపాన్ని డెకరేట్ చేస్తుండగా మహేశ్ అనే బాలుడికి కరెంట్ షాక్ కొట్టింది. బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.... వినాయకుడి మండపం వద్ద కరెంట్ కనెక్షన్ తీసుకునేటప్పుడు స్థానిక లైన్‌మెన్, ఎలక్ట్రీషియన్ల సాయం తీసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed