- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో మెజారిటీ సీట్లు ఎన్డీఏకే రాబోతున్నాయ్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకు మెజారిటీ సీట్లు గెలుచుకోబోతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అన్నారు. ఇవాళ విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ ఎన్నికల కో-ఇంచార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ సింగ్ మాట్లాడుతూ.. నామినేషన్లు వేసిన నాటి నుంచి అందరూ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సర్వేలు అన్ని ఎన్డీఏకు అనుకూలంగా వచ్చాయని వెల్లడించారు. పార్టీ అధ్వర్యంలో జరిగిన ప్రతి బహిరంగ సభను విజయవంతం చేసేలా ముఖ్య నాయకులు చొరవ తీసుకోవాలన్నారు. సార్వత్రిక ఎన్నికలతో ఏపీలో బీజేపీని బలోపేతం చేసుకోవలన్నారు. అనంతరం బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులుగా భావించి విజయానికి కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.