టీడీపీ పార్టీ నుంచి మహాసేన రాజేష్ సస్పెండ్

by Mahesh |   ( Updated:2024-05-09 15:10:31.0  )
టీడీపీ పార్టీ నుంచి మహాసేన రాజేష్ సస్పెండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికల వేళ టీడీపీకి కొరకనికొయ్యాలా మారిన రాజేష్ మహాసేన సమస్యకు అధిష్టానం చెక్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో పీ గన్నవరం నుంచి టీడీపీ అతనికి మొదట టికెట్ కేటాయించింది. కానీ వివాదాస్పద నేత అయిన రాజేష్ కు టికెట్ ఇవ్వడం తో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో స్వతహాగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. తర్వాత పొత్తులో భాగంగా ఈ సీటును జనసేన పార్టీకి కేటాయించారు. దీంతో ఆగ్రహించిన ఆయన రేబల్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ చంద్రబాబు బుజ్జగింపులతో పోటీ నుంచి తప్పుకోగా ఆయనను స్టార్ క్యాంపెయినర్ గా టీడీపీ నియమించింది. కానీ కొద్ది రోజులకే రాజేష్ మహాసేన ఎన్డీయే కూటమికి షాక్ ఇచ్చి.. జనసేన పార్టీకి తమ మద్దతును ఉపసంహరించుకుంటన్నట్లు తెలిపారు. అలాగే జనసేన అభ్యర్థి ఓటమికి ప్రచారం చేస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన టీడీపీ అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Read More..

కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు

Advertisement

Next Story

Most Viewed