- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖకు మహర్దశ.. క్యూ కడుతున్న కంపెనీలు
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిగా ప్రకటించిన తర్వాత విశాఖపట్నంకు మహర్దశ పట్టుకుంది. విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని.. ఐటి హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖతోపాటు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సమ్మిట్ సైతం ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఏపీలో మరో మూడు కొత్త యూనిట్ల ఏర్పాటుకు విశాఖపట్నం ప్రత్యేక ఆర్థిక మండలి ఆమోదం తెలిపింది. మొత్తం 12 యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయగా ఆంధ్రప్రదేశ్ (మూడు), తెలంగాణ (తొమ్మిది)లో యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ యూనిట్లకు రూ.1,956 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. 2,943 మంది అర్హులైన అభ్యర్థులకు ఈ యూనిట్లలో ఉపాధి లభించనుంది. ప్రతిపాదిత యూనిట్లలో ఎక్కువ భాగం సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా కెనడా, యుఎస్‌కి చెందిన వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నాయి.
ఏపీలో మూడు యూనిట్లు ఏర్పాటు
ఏపీలోని మూడు యూనిట్లలో ఒకటి బయోడీజిల్ తయారీ సంస్థ అయిన.. అద్వైత్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన గ్రాన్యూల్స్ CZRO ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను విశాఖపట్నంలో ఏర్పాటు కానున్నాయి. వీటి ఏర్పాటుతో అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. కొత్తగా ఏర్పడే అన్ని సంస్థల ఉత్పత్తులు, వాటి సమాచార సాంకేతికత సేవలకు సంబంధించినవి. ఈ సందర్భంగా విసెజ్ జోనల్ డెవలప్‌మెంట్ కమిషనర్ ముప్పాల శ్రీనివాస్ మాట్లాడుతూ..‘ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తొలుత 12 యూనిట్లు ఆమోదించబడ్డాయన్నారు. ఇక ఆరు నెలల్లోగా తమ కార్యకలాపాలు ప్రారంభించాలన్నారు. నిర్ణీత వ్యవధి కంటే ముందే ఆయా యూనిట్లు తమ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ఆశిస్తున్నాం’ అని వెల్లడించారు.