Sub Collectorate fire : మదనపల్లి సబ్ కలెక్టరేట్‌ అగ్నిప్రమాదం.. షార్ట్‌ సర్క్యూట్ కాదని నిర్ధారణ

by Mahesh |
Sub Collectorate fire : మదనపల్లి సబ్ కలెక్టరేట్‌ అగ్నిప్రమాదం.. షార్ట్‌ సర్క్యూట్ కాదని నిర్ధారణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కీలకమైన ఫైళ్లు దగ్ధం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మదనపల్లి సబ్ కలెక్టరేట్‌ ఫైర్ ప్రమాదంపై విచారణ ప్రారంభించారు. అలాగే ఈ ఘటనపై ఎస్పీడీసీఎల్, ఫైర్ సిబ్బంది ప్రాథమిక నివేదిక ఇవ్వాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు కోరారు. దీంతో పాటుగా సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ద్వారా కీలక విషయాలు CID చీఫ్ రవిశంకర్ అయ్యర్ తెలుసుకున్నారు. అలాగే రంగంలోకి దిగిన క్లూస్‌టీమ్‌, డాగ్‌స్క్వాడ్ సాయంతో ఆధారాల సేకరించి..షార్ట్‌ సర్క్యూట్ కారణం కాదని ఈ ప్రమాదం జరగలేదని.. అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అలాగే కావాలనే ఫైళ్లను తగల బెట్టారనే కుట్ర కోణంపై డీజీపీ, సీఐడీ చీఫ్‌ ఆరా తీస్తున్నారు.

Next Story

Most Viewed