- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో నుంచి రావాలే తప్ప పేపర్లు, టీవీల్లో కాదు : ఎన్టీఆర్ వారసులపై విజయసాయిరెడ్డి ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో : దివంగత సీఎం నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలకు కేంద్రం అరుదైన గౌరవం కల్పించింది. ఎన్టీఆర్ ఫోటోతో రూ.100 నాణేంను విడుదల చేసింది. దీంతో నందమూరి కుటుంబ సభ్యులతోపాటు ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తాము అభిమానించే నాయకుడు, నటుడుకు అరుదైన గుర్తింపు రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతుంటే వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మాత్రం ఎన్టీఆర్ వారసులను టార్గెట్ చేస్తూ ట్విటర్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్టీఆర్ జ్ఞపకాలను చెరిపివేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ‘ఎన్టీఆర్ ప్రేమతో చూసుకున్న అబిడ్స్ ఇల్లు విజయ్ ఎలక్ట్రికల్స్ రమేశ్‌కి కేవలం 4 కోట్లకు అమ్ముకున్నారు. వీళ్ళ దగ్గర నాలుగు కోట్లు కూడా లేవా? అది నందమూరి రామకృష్ణ వాటాకు వచ్చింది. చంద్రబాబు లేక పురంధేశ్వరి ఆ ఇంటిని కొని ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా ఉంచవచ్చుగా! అప్పుడు ఎన్టీఆర్ మీద మీకున్న నిజమైన ప్రేమకు అద్దం పడుతుంది అంటూ ట్విటర్ వేదికగా కడిగిపారేశారు. ఈ సందర్భంగా మద్రాస్‌లోని ఎన్టీఆర్ నివసించిన ఇంటి ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన వీడియోను అప్‌లోడ్ చేశారు. ‘మద్రాస్ లోని ఎన్టీఆర్ ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆ మహా నటుడి మీద మీకున్న ప్రేమ ఏంటనేది తెలుస్తుంది. వాటాలు తేల్చుకోలేక దానిని పాడు పెట్టేశారు. బంజారాహిల్స్ లో ఆయన చివరి క్షణాలు గడిపిన ఇంటిని పడగొట్టి అపార్ట్మెంట్ లు కట్టుకుని అద్దెకిచ్చారు.దానికి ఎదురుగా ఉన్న మరో ఇంట్లో మ్యూజియం పెట్టాలని ఎన్టీఆర్ భావించగా.. ఆయన ఆశయాన్ని గౌరవించి, దానిని మ్యూజియంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీకు లేదా?’ అని విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు సమాధి తప్ప స్మారకచిహ్నం కూడా లేకుండా చేసి ఇప్పుడు రూ.100 నాణేం అంటూ మురిసిపోతున్నారు. తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో నుంచి, అంతరంగంలో నుంచి రావాలే కానీ పేపర్లు, టీవీల్లో కాదు చెల్లెమ్మా!’అంటూ విజయసాయిరెడ్డి హితబోధ పలికారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ఏనాడూ ఢిల్లీలో డిమాండ్ వినిపించలేదు కానీ పూర్వాశ్రమంలో మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన మీ మాజీ బాస్ సోనియా గాంధీకి ఇప్పుడు చెబుతున్న హృదయపూర్వక కృతఙ్ఞతలు మరచిపోలేమమ్మా!’ అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.