- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Cheetah:ఆ జిల్లాలో మరోసారి చిరుత సంచారం..భయాందోళనలో స్థానికులు
దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల చిరుత పులులు, ఏనుగులు స్థానిక అటవీ ప్రాంతాల నుంచి జనారణ్యంలోకి వస్తున్నాయి. ఇటువంటి ఘటనలు ఈ మధ్య మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. నంద్యాల జిల్లాలోని మహానందిలో చిరుత మరోసారి సంచారం కలకలం రేపింది. తాజాగా మహానంది దేవస్థానం వెనుక గోశాల వద్ద శుక్రవారం రాత్రి 8:50 గంటల సమయంలో చిరుత పులి సంచరించినట్లు దేవస్థానం అధికారులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. దీంతో గ్రామస్తులు, భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఈ మహానంది క్షేత్ర పరిసరాల్లో, గ్రామ శివారులో గత రెండు నెలలుగా చిరుత సంచారంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని సమాచారం. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు చెబితే గ్రామ శివారులో, గుడి వెనుక భాగాన చెత్త వేయడం వల్ల పందులు, కుక్కలు గుంపులుగా ఉంటున్నాయని వాటి కోసం చిరుత వస్తుందన్నారని గ్రామస్తులు వాపోయారు. ప్రాణహాని జరిగితే గానీ చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోరా? అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.