చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-02-09 09:34:40.0  )
చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చే టప్పుడు చంద్రబాబు రెండున్నర ఎకరాల ఆస్తి మాత్రమే ఉందని ఆమె వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె ఇప్పుడు రూ. 6 లక్షల కోట్లకు చంద్రబాబు అధిపతి ఎలా అయ్యారని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ పార్లమెంట్‌లో చేప్పగానే వెంటనే చంద్రబాబు అక్కడ వాలిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన గంటకే ఓ ఫేక్ సర్వే బయటకొచ్చిందని విమర్శించారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు రకరకాల వేషాలు వేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని.. అలాంటి పార్టీని హస్తం పార్టీ నేతల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబును టీడీపీ కార్యకర్తలే తరిమివేయాలని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story