Ap News: తిరుపతిలో అరెస్టైన లక్ష్మికి బెయిల్ మంజూరు

by srinivas |   ( Updated:2025-02-12 11:39:23.0  )
Ap News: తిరుపతిలో అరెస్టైన లక్ష్మికి బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirumala)లో అరెస్టైన లక్ష్మి(Laxmi)కి బెయిల్ మంజూరు అయింది. తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్‌పై ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమెను జైపూర్ పోలీసులు(Jaipur Police) అరెస్ట్ చేశారు. చెక్‌బౌన్స్‌ కేసు(Check Bounce Case)కు సంబంధించి తిరుపతికి వెళ్లిన పోలీసులు లక్ష్మిని అరెస్ట్ చేసి జైపూర్‌కి తీసుకెళ్లారు. ఇదే కేసులో తాజాగా లక్ష్మికి జైపూర్ కోర్టు(Jaipur Court) బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.

కాగా కిరణ్‌రాయల్ వివాదంలో లక్ష్మి తెరపైకి వచ్చారు. కిరణ్ రాయల్ తన వద్ద కోటి 20 లక్షలు రూపాయలు తీసుకున్నారని, తిరిగి ఇవ్వడంలేదని, అందువల్లే తను చనిపోవాలనుకుంటున్నానని లక్ష్మి సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. అయితే ఇదంతా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు చేయిస్తున్నారని కిరణ్ రాయల్ తెలిపారు. ఇక తనపై ఆరోపణలు చేస్తున్న మహిళల ఓ ఫ్రాండ్ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారం రేపింది. వైసీపీతో పాటు పలువురు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కిరణ్ రాయల్, లక్ష్మి వ్యవహారంపై అటు అధినేత పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉండగా అనూహ్యంగా తిరుపతిలో లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో లక్ష్మి తీరు చర్చనీయాంశంగా మారింది. ఇంతలోనే ఆమెకు బెయిల్ మంజూరు అయింది. తదుపరి పరిణామలు ఎలా ఉంటాయో చూడాలి.

Next Story