కొలనుభారతిలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

by Jakkula Mamatha |
కొలనుభారతిలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
X

దిశ, నందికొట్కూరు: సరస్వతీ దేవి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోనే ఏకైక సరస్వతి ఆలయంగా పేరుగాంచిన నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం శివపురం గ్రామ శివారులోని శ్రీ సరస్వతీ దేవి కొలనుభారతి క్షేత్రంలో ఆదివారం వసంత పంచమి వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరయ్యారు. ఈవో రామలింగ రెడ్డి , ఆలయ అర్చకులు ఆయనకు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. శ్రీశైలం దేవస్థానం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే జయసూర్య అమ్మవారికి సమర్పించారు.

అనంతరం జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ ఇన్‌చార్జి అసిస్టెంట్‌ కమిషనర్‌ మోహన్‌, ఆలయ ట్రస్ట్‌ చైర్మన్‌ వెంకటనాయుడు, తహసీల్దార్‌ ఉమారాణి, ఎంపీడీవో మేరీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శ్రీనివాసరెడ్డి, ఆర్టీసీ డీఎం వినయ్‌ కుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ జుబేర్‌, డా.విజయేంద్ర, ఎస్‌ఐ కేశవ, స్థానిక సర్పంచ్‌ చంద్రశేఖర్‌ యాదవ్‌,టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాధ్ రెడ్డి, కన్వీనర్ నారపురెడ్డి, లింగ స్వామి గౌడ్, చంద్రశేఖర్, చంద్ర గౌడ్, నాగార్జున గౌడ్, బుచ్చిరెడ్డి, శివారెడ్డి, నాగేశ్వరరావు, పలుచని మహేశ్వరరెడ్డి, ఆయా మండలాల తహశీల్దార్లు, కమిటీ సభ్యులు, మండల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed