- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yemmiganur: రాయలసీమకు గుడ్ న్యూస్.. కీలక సమస్య తీరుస్తామని కేంద్రమంత్రి హామీ
దిశ, ఎమ్మిగనూరు: బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రాయలసీమలో నీళ్ల సమస్య తీరుస్తామని కేంద్ర మంత్రి దేవుసిన్హా చౌహన్ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మిగనూరులో మహాజన్ సంపర్క్ అభియాన్ అనే నినాదంతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. కేంద్ర మంత్రి దేవుసిన్హా చౌహాన్ మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు రావాలి జగన్ అన్నారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లకే పోవాలి జగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు రెండూ దొంగల ప్రభుత్వాలన్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం తెలుగు మీడియా తొలగించి ఇంగ్లీషు మీడియం పాఠశాలలు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సొంత భాషలను అభివృద్ధి చేసుకుంటుంటే ఒక ఆంధ్రలో మాత్రం జగన్ ప్రభుత్వం తెలుగు మీడియాన్ని తొలగించినడం ఎంత వరకు న్యాయమన్నారు. మాతృ భాషను చంపేస్తున్న ఘనుడు జగన్ అని విమర్శించారు.
హిందూ దేవాలయల హుండీ డబ్బులను పాస్టర్లకు, మౌలానాలకు జీతాలు ఇస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చినా వెంటనే వారి జీతాలు తొలగిస్తామని తెలిపారు. ఈ యాబై సంవత్సరంలో కేరళలో ఏం జరిగిందో ఆంధ్రలో కూడా అదే జరుగుతోందన్నారు. ఆంధ్రలో బుల్డోజర్ బాబా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి దేవుసిన్హా చౌహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.