Srisailamలో కట్టుదిట్టమైన భద్రత.. రంగంలోకి దిగిన ఎస్పీ

by srinivas |
Srisailamలో కట్టుదిట్టమైన భద్రత.. రంగంలోకి దిగిన ఎస్పీ
X

దిశ, కర్నూలు ప్రతినిధి: మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల భద్రత దృష్ట్యా శ్రీశైలంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు నంద్యాల జిల్లా కె.రఘువీర్ రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో కమాండ్ కంట్రోల్ క్యూలైన్, ముఖ ద్వారం, సాక్షి గణపతి, నంది సర్కిల్ తదితర ప్రాంతాల్లో భద్రతా ఏర్పా్ట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, వాహనాలను రోడ్డుకిరువైపులా ఉంచకుండా, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా సాఫీగా వెళ్లడానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు వివరించారు. దైవదర్శనానికి వెళ్లే క్యూలైన్లను కూడా ఆయన పరిశీలించారు. క్యూ లైన్‌లలో ఎలాంటి అసౌకర్యానికి తావు లేకుండా చూడాలని ఆదేశించారు. అలాగే క్యూలైన్లను పెంచాలని అక్కడ గట్టి పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. వీఐపీలు, వీవీఐపీలు వెళ్లే మార్గంలో ఎలాంటి వాహనాలు నిలపరాదని, ప్రస్తుతం ఉన్న వాహనాలను త్వరగా రోడ్లపై నుంచి తొలగించాలన్నారు. , పాగాలంకరణకు వెళ్లే మార్గంలో శివ స్వాములు క్యూలైన్లలో కొంతమేర విశ్రాంతి తీసుకునేలా కార్పెట్లు వేయాలని, ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నిఘానేత్రంతో ఆలయ పరిసరాల పరిశీలన

ఆలయ పరిసరాలన్నింటినీ పరిశీలించే నిఘానేత్రం కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించి అక్కడి సిబ్బందితో మాట్లాడి 24 గంటలు సీసీ కెమెరాల పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే అధికారులకు సమాచారం అందించేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

34 బ్లూ కోట్స్ సిబ్బంది ఏర్పాటు

ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు 34 బ్లూ కోట్స్ సిబ్బందిని ఏర్పాటు చేసి వాటిని రెండు షిఫ్టులుగా విభజించినట్లు చెప్పారు. 17 బ్లూ కోట్స్ నిరంతరం శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తూ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే సమాచారం అందించేలా చూసుకుంటామని తెలియజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్. రమణ, ఆత్మకూరు డీఎస్పీ వై.శృతి, టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ, డిప్యూటీ ఇంజనీర్ నరసింహారెడ్డి, ఆత్మకూరు సీఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story