Kurnool: కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలు.. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:5 Nov 2024 2:10 PM  )
Kurnool: కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలు.. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District) దేవనకొండ మండలం కప్పట్రాళ్ల(Kappatrala)లో యురేనియం(Uranium) తవ్వకాలకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. యురేనియం తవ్వకాలతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని దాదాపు 15 గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. యురేనియం తవ్వకాలను నిలిపివేసేలా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి ఆదేశాలు జారీ చేయించాలని కోరుతున్నారు.


ఈ నేపథ్యంలో యురేనియం తవ్వకాల విషయంలో తెలుగుదేశం పార్టీ నిజనిర్దారణ కమిటీ(Telugu Desam Party Fact Finding Committee) వేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు కప్పట్రాళ్లలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. స్థానిక నేతలు, ప్రజలతో సమావేశాలు నిర్వహించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లో అసాంఘిక శక్తులు చొరబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే నిరసనల్లో ప్రజా సంఘాలు చేరాయని తెలిపారు. యురేనియం ప్రాజెక్ట్‌ కేంద్రానికి సంబంధించినదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమస్యను సీఎం చంద్రబాబు(CM Chandrababu) దృష్టికి తీసుకెళ్తామని టీడీపీ నిజనిర్దారణ కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed