Kurnool Collector: ఇక నుంచి గోడలపై ఉమ్మివేస్తే కఠిన చర్యలు

by srinivas |
Kurnool Collector: ఇక నుంచి గోడలపై ఉమ్మివేస్తే కఠిన చర్యలు
X

దిశ, కర్నూలు ప్రతినిధి: కలెక్టరేట్ ఆవరణంలో గోడలపై ఉమ్మివేస్తే కఠిన చర్యలు తప్పవని, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్ఓ, డ్వామా, వ్యవసాయ శాఖ, పశు సంవర్థక శాఖ, డీఆర్డిఏ, ట్రెజరీ, సీపీఓ, ఎలక్షన్ సెల్, సెక్షన్ కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కార్యాలయాలను పరిశీలిస్తూ కార్యాలయాలలో వెంటిలేషన్ చాలా డల్‌గా ఉందన్నారు. ఇలా ఉంటే పనులెలా చేసుకుంటారని, వెంటిలేషన్, లైటింగ్ ఉంటే సిబ్బంది పని చేయడానికి చాలా ఉత్సాహంగా ఉంటారని, ఎటువంటి లీకేజ్ అవ్వకుండా వైట్ వాష్, పురుషులు, మహిళలకు సంబంధించి వాష్ రూంలు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అదే విధంగా కార్యాలయం బయట నిరుపయోగంగా ఉన్న విద్యుత్ తీగలను తీసేసి అవసరం ఉన్న విద్యుత్ తీగలను ఒకే పైప్ లైన్ లో అమర్చాలన్నారు. కార్యాలయ పరిసరాల్లో భోజనం చేసిన ప్లేట్లు, గ్లాసులు పడేసి చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా ఉంచుకున్నారని, అలా కాకుండా ఏ శాఖ కార్యాలయానికి సంబంధించి ఆ కార్యాలయ సిబ్బంది వారి కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛ్ సంకల్పంలో భాగంగా కార్యాలయ సిబ్బంది అంతా తమ తమ కార్యాలయాలను శుభ్రపరచుకుంటే బాగుంటుంద న్నారు. ఆఫీసులలో ఉన్న పాత పరికరాలు, ఫైల్స్‌కి సంబంధించి డిస్పోసల్ చేయాలన్నారు. కార్యాలయ ఫైల్స్ బయట పెట్టకుండా స్కానింగ్ చేసుకొని సిస్టంలో భద్రపరచుకోవాలన్నారు. పశు సంవర్థక శాఖ కార్యాలయం శుభ్రంగా ఉందని కలెక్టర్ ప్రశంసించారు. కార్యాలయ ప్రాంగణంలో ఎలాంటి పోస్టర్లు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అమర్చిన సీసీ కెమెరాల పనితీరు ఎలా ఉందని జిల్లా రెవెన్యూ అధికారిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ నాగేశ్వరరావు, సీపీఓ అప్పలకొండ తదితరులున్నారు.

Advertisement

Next Story

Most Viewed