శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం

by srinivas |   ( Updated:2023-04-15 16:13:42.0  )
శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం
X

దిశ, శ్రీశైలం: శ్రీశైలంలో డ్రోన్ ఘటన మిస్టరీగా మారింది. శ్రీశైలం దేవస్థానం పరిధిలో డ్రోన్ కలకలం రేపింది. ఆకాశంలో డ్రోన్ చక్కర్లు కొట్టింది. శ్రీశైలంలోని ఆర్టీసీ బస్టాండు, కమ్మ సత్రం, బలిజ సత్రం ఆలయ పరిసరాలలో ఆకాశంలో ఎగురుతూ డ్రోన్ కెమెరా స్థానికులకు కనిపించింది. దేవస్థానం అధికారుల అనుమతి లేకుండా ఆకాశంలో డ్రోన్ కెమెరా ఎగిరింది. ఈ డ్రోన్‌ను పట్టుకునేందుకు దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది విశ్వప్రయత్నాలు చేశారు.

సత్రాలపైకి ఎక్కి డ్రోన్‌ను ఎగరేసిన వారికోసం సెక్యూరిటీ సిబ్బంది వెదికారు. డ్రోన్ కెమెరాను పట్టుకోవడంలో దేవస్థానం సెక్యూరిటీ విఫలమైందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. డ్రోన్ తిరగడంపై భక్తులు, స్థానికుల్లో మళ్లీ భయం మొదలైంది. శ్రీశైల క్షేత్రంలో ఇన్నిసార్లు డ్రోన్ తిరగడం ఏంటని, దేవస్థానానికి ఏదైనా ముప్పు పొంచి ఉందా అని స్థానికులు కలవర పడుతున్నారు. దేవస్థాన అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా శ్రీశైలంలో డ్రోన్లు తిరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తామన్న అధికారులు.. దేవస్థానానికి ఇంటెలిజెన్స్ వర్గాలను, విజిలెన్స్ అధికారులను ప్రత్యేకంగా కేటాయించాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Kalyanadurgam: 54 మంది ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం

Advertisement

Next Story