ప్రసన్న బాధ్యత నాది: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి

by srinivas |
ప్రసన్న బాధ్యత నాది: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి
X

దిశ, ప్రతినిధి నంద్యాల సిటీ: నంద్యాల జిల్లా చాగల్లమర్రి మండలం చినవంగలిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. ప్రసన్న అనే విద్యార్థిని వేరే ఊరిలో చదువుకోవడం వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఈ ఘటనపై నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డా. బైరెడ్డి శబరి స్పందించారు.. ఈ ఘటన అందరిని కలిసివేస్తోందన్నారు. కుటుంబాన్ని పోగోట్టుకున్న ప్రసన్న చదువు బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్చిన పరిహారం అందించేందుకు కృషి చేస్తానని గ్రామస్తులకు ఎంపీ శబరి హామీ ఇచ్చారు.

కాగా చాగలమర్రి మండలం చినవంగలి గ్రామంలో మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత ప‌డ్డారు. మృతులు గురుశేఖర్‌రెడ్డి (45), దస్తగిరమ్మ (38) దంపతులు ఉండ‌గా, వారి ఇద్దరు కుమార్తెలైన‌ పవిత్ర (16), గురులక్ష్మి(10)లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed