- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kurnool: బీఆర్ఎస్‌లోకి వెళ్లరట..!
దిశ, కర్నూలు ప్రతినిధి: నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి వైసీపీలోనే కొనసాగుతున్నారు. బీఆర్ఎస్‌లో చేరికపై ఆయన అనుచరులు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకు చెందిన పార్టీలో చేరడంలేదని కొట్టిపారేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న ఈయన ఉమ్మడి కర్నూలు జిల్లా జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరించి జిల్లా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడు కావడంతో అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న నీటి ముంపు నిరుద్యోగుల కోసం కృషి చేసి అనేక ఉద్యోగాలిప్పించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
అలాగే తంగెడంచ వద్ద విత్తనోత్పత్తి కోసం ప్రతిపాదనలు పంపారు. ప్రత్యేకించి ఆయన ఎమ్మె్ల్యేగా ఉన్న సమయంలో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసిన ఘనత లబ్బి వెంకటస్వామికే దక్కతుందని ఆయన అనుచరులు కాటెపోగు భాస్కర్ తెలిపారు. భవిష్యత్ లో వైసీపీ పార్టీ కోసం మరింత కృషి చేసి నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టించేలా కృషి చేయనున్నట్లు చెప్పారు.
గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు రాకపోయినా అధిష్టానం మేరకు పార్టీ అభివృద్ధితో పాటు అభ్యర్థుల గెలుపునకు విశేష కృషి చేశారని కొనియాడారు. అంతేకాకుండా నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏకైక సరస్వతీ క్షేత్రమైన శ్రీ కొలనుభారతీ క్షేత్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అక్కడ సప్త శివాలయాలు, రహదారి మార్గం తదితర కార్యక్రమాలు చేసి నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. భవిష్యత్ లో మిగిలిన నీటి ముంపు నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పించే విధంగా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే అవకాశం ఉందని ఆయన అనుచరులు తెలియజేశారు.
Also Read..