Kurnool: తుంగభద్ర నది నుంచి వరద కాల్వ నిర్మించండి.. టీడీపీ నేత తిక్కారెడ్డి డిమాండ్

by srinivas |
Kurnool: తుంగభద్ర నది నుంచి వరద కాల్వ నిర్మించండి.. టీడీపీ నేత తిక్కారెడ్డి డిమాండ్
X

దిశ, మంత్రాలయం ప్రతినిధి: మేలిగనూరు వద్ద తుంగభద్ర నది నుంచి వరద కాల్వను నిర్మించాలని మంత్రాలయం టీడీపీ ఇంచార్జి తిక్కారెడ్డి డిమాండ్ చేశారు. తద్వారా మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాలు సస్యశ్యామలవుతాయని ఆయన తెలిపారు. వరద కాల్వ ద్వారా వచ్చిన నీటిని నిల్వ చేస్తే సుమారు 5 నుంచి 10 టీఎంసీ నీటిని ఉపయోగించుకోవచ్చన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే వరద కాల్వను నిర్మించి పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఎగువన వేదావతి ప్రాజెక్టు నిర్మించి వరద నీరు, వేదావతి నీటిని అనునసంధానం చేసి పచ్చని భూములుగా మార్చి రెండు పంటలకు సాగునీటిని అందిస్తామన్నారు.

మేలిగనూరు వద్ద తుంగభద్ర నది నుంచి వరద కాల్వను తిక్కారెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని, తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు, జిల్లా కార్యదర్శి కోట్రేష్ గౌడ్, రమేష్ గౌడ్, వెంకటరెడ్డి, బిసి సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు, టి యన్ యస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివమూర్తి, యస్‌సి సెల్ జిల్లా కార్యదర్శి రాజాబాబు, శివప్పగౌడ్ కావలి ఈరప్ప, ఓబులాపురం నరసింహులు, ఐ టిడిపి అధ్యక్షులు సల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed