- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు.. ఎంత ఆదాయం వచ్చిందంటే?

దిశ ప్రతినిధి,నంద్యాల: ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు శనివారం నిర్వహించిన ముడుపులు, కానుకల హుండీ లెక్కింపు వల్ల 20 లక్షల 77 వేల 133 రూపాయలు నగదు, 945 గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో యం.రామకృష్ణ తెలిపారు.
ఈ లెక్కింపు నంద్యాల మూల సాగరం సామూహ దేవస్థానముల కార్య నిర్వహణ అధికారి వి.గోపి పర్యవేక్షణలో నిర్వహించబడినది. అక్టోబర్ 29, 2024 నుండి నేటి వరకు ఈ ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి, భీరం శివరామిరెడ్డి, వీరయ్య స్వామి, బాణా శ్రీనివాస్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, పాణ్యం ఏఎస్ఐ రఫీ, పీసీ సూర్య కుమార్, శ్రీరామ సేవా సమితి అధ్యక్షురాలు సుహాసిని సభ్యులు, శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు శివమ్మ సీతారామరెడ్డి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.