విద్యార్థినిల పట్ల అసభ్య ప్రవర్తన.. లెక్కల మాస్టర్‌ను చితకబాదిన తల్లిదండ్రులు

by srinivas |
విద్యార్థినిల పట్ల అసభ్య ప్రవర్తన.. లెక్కల మాస్టర్‌ను చితకబాదిన తల్లిదండ్రులు
X

దిశ, వెబ్ డెస్క్: కడప జగన్నాథపురంలో దారుణం జరిగింది.నగర పాలక సంస్థల ఉన్నత పాఠశాలలో చదవుతున్న విద్యార్థినుల పట్ల లెక్కర్ బాస్టర్ శ్రీనివాసరావు అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే దిగజారి ప్రవర్తించడంపై తల్లిదండ్రులు మండిపడ్డారు. పాఠశాలకు వెళ్లి శ్రీనివాసరావును నిలదీశారు. దీంతో పారియేందుకు ప్రయత్నించారు. విద్యార్థినిలు పట్టుకుని తల్లిదండ్రులతో కలిసి లెక్కల మాస్టర్‌కు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. విద్యార్థినిల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లెక్కల మాస్టర్ శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. గుడ్ టచ్, బ్యాట్ టచ్‌పై పాఠశాలలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఎవరైనా సరే వేధింపులకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని విద్యార్థినిలను కోరారు.

Advertisement

Next Story