మళ్లీ గెలిస్తేనే పథకాలు.. లేకపోతే అంతే..?: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-05-09 06:18:52.0  )
మళ్లీ గెలిస్తేనే పథకాలు.. లేకపోతే అంతే..?: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ సర్కిల్‌లో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే కోసమో.. ఎంపీ కోసమో నిర్ణయించేవి కావని.. ఐదేళ్ల భవిష్యత్తు అని జగన్ వ్యాఖ్యానించారు. జగన్ మళ్లీ గెలిస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పారు. అలా జరగకపోతే పథకాలు నిలిచిపోతాయన్నారు. ప్రతిపక్ష పార్టీ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదన్నారు. తన 59 నెలల పాలనలో మేనిఫెస్టో వాగ్ధానాలను 99 శాతం అమలు చేశామని చెప్పారు. రూ. 2.70 వేల కోట్లు లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. ఎలాంటి వివక్ష, లంచాలు లేకుండా పథకాలు అందజేశామని తెలిపారు. ఇలాంటి సంక్షేమ పథకాలు ఎవరైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. నాడు, నేడుతో ప్రభుత్వ బడుల రూపరేఖలు మార్చేశామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామన్నారు. విద్యా కానుకతో విద్యార్థులకు అండగా నిలిచామని చెప్పారు. పిలల్ల చదువుల కోసం అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెనను తీసుకొచ్చామని తెలిపారు. ఈ మార్పులన్నీ గతంలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. మహిళలకు అసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఇచ్చారా అని సీఎం జగన్ ప్రశ్నించారు

Advertisement

Next Story

Most Viewed