పవన్ చొరవ.. రంగంలోకి కుంకీ ఏనుగులు

by srinivas |
పవన్ చొరవ.. రంగంలోకి కుంకీ ఏనుగులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) చూపిన చొరవ ఫలించింది. చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల శివారు ప్రాంతాల్లో ఏనుగులు హల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏనుగుల దాడుల్లో మనుషుల ప్రాణాలు పోవడంతో పాటు చాలా ప్రాంతాల్లో పంటలు ధ్వంసం అవుతున్నాయి. దీంతో రైతులు లబో దిబో మంటున్నారు. దీంతో ఏనుగుల సమస్యను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కుంకీ ఏనుగులను ఏపీకి పంపాలని ఆయన కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వం పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రాష్ట్రానికి పంపనుంది. .ఈ మేరకు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. ఆరు అంశాలకు సంబంధించిన పత్రాలపై ఇరు ప్రభుత్వాలు, అటవీశాఖ అధికారులు సంతకం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ కండ్రే, రెండు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. పంట పొలాలను ధ్వంసం చేసే ఏనుగుల గుంపును తరమికొట్టడంతో ఈ కుంకీ ఏనుగులు కీలకంగా పని చేస్తాయని పవన్ కల్యాణ్ తెలిపారు. కొన్ని సమయాల్లో గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగులను రక్షించడంలోనూ ఇవి కీలక భూమి పోషిస్తాయని ఆయన తెలిపారు. దసరానాటికి కుంకీ ఏనుగులు రాష్ట్రానికి వస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed