- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్‌పై నమ్మకం! ఎన్నికల వేళ కేటీఆర్ సంచలన కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల వేళ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో మాజీ మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మన ప్రభుత్వాలని మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఈ రోజు ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదన్నారు. దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని సూచించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడికే తన ఓటు వేసినట్లు చెప్పారు. గత ఎన్నికలు సాధించిన సీట్ల కన్నా ఎక్కువ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ స్టేషన్లో దగ్గర కరెంటు కోతలు లేకుండా జనరేటర్లు పెట్టి ముగ్గురు ముగ్గురు అధికారులతోని తెలంగాణ ప్రభుత్వం కష్టపడుతుందన్నారు. ఆరు గ్యారంటీలో ప్రభుత్వం ఒక గ్యారెంటీని సగం సగం అమలు చేసిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తాను ముఖ్యమంత్రిని గుర్తించాలి.. అని విమర్శించారు. ఆయన ప్రభుత్వ పనితీరు పైన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కరెంటు కోతలు నీటి కొరతల వంటి అసలైన సమస్యల పైన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజా సమస్యలపై, ప్రభుత్వం పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జగన్ మంచి ఫలితాలు సాధిస్తారు
ప్రధాని నరేంద్ర మోడీ శ్రీ రామచంద్ర ప్రభువుకు చెప్పినట్టు రాజా ధర్మాన్ని పాటించాలన్నారు. అన్ని రాష్ట్రాల మధ్యన ఎలాంటి వివక్ష లేకుండా నిధులను కేటాయించడం లేదా ప్రాజెక్టులు కేటాయించడం చేయలేదన్నారు. దేశం మొత్తం ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. ప్రజలు ఎవరికి ఓటేస్తారో నాలుగో తేదీన తేలుతుందని, పదేళ్లు మోడీ ప్రజలని మోసం చేస్తుంటే.. వంద రోజుల నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు కరెంటు కోతల పైన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినట్టుగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు.. ఇన్వర్టర్లు జనరేటర్లు, క్యాండిల్స్, పవర్ బ్యాంకులు, చార్జింగ్ లైట్, ఇవే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అని విమర్శించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తన అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తపరిచారు. జగన్మోహన్ రెడ్డి తనకు సోదరుడి లాంటివాడన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ తనకు అనేకమంది మిత్రులు ఉన్నారని, ఈ ఎన్నికల్లో ఆయన మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉందన్నారు.