- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోర్టు టర్మినల్ చిచ్చు..ఇద్దరు నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య కృష్ణపట్నం పోర్టు టర్మినల్ చిచ్చు పెట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పరిశ్రమలు తరలివెళ్లిపోయాయని టీడీపీ నేతలు అరోపిస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణపట్నం పోర్టు కూడా త్వరలో తరలిపోతుందని టీడీపీ నేతలు గత నాలుగేళ్లుగా చెబుతున్నారు. అయితే పోర్టులో ఇటీవల జరిగిన ఓ ఘటన మాజీ మంత్రి సోమిరెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. అంతేకాదు పోర్టులో కంటైనర్ టర్నినల్ మూత పడటంతో అఖిలపక్షం నిర్వహించి అధికార పార్టీ నేతల పై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణపట్నం పోర్టు మూతపడిందని తాను జనవరి నెలలోనే చెప్పానని, శుక్రవారం కంటైనర్ వెజిల్ నుంచి కొన్ని కంటైనర్లు అన్‌లోడ్ జరిగాయని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. అది కేవలం ట్రాన్సిట్ వెజిల్ మాత్రమేనని, ఎక్స్‌పోర్ట్ కోసం లోడింగ్ జరిగిందా అని నిలదీశారు. మంత్రి కాకాణి ఎప్పుడూ నిజాలు చెప్పరని, అవస్తవాలు ప్రచారం చేస్తారని మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శించారు.
అయితే మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కష్ణపట్నం పోర్టు టర్మినల్ తరలిపోతుందంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టర్మినల్ కొనసాగుతోందని పోర్టు సీఈవో ప్రకటించారని గుర్తు చేశారు. అఖిపక్షం పేరుతో సోమిరెడ్డి డ్రామాలాడుతున్నారని ఆరో పించారు. అఖిలపక్షం నేతలు సోమిరెడ్డి ఉచ్చులో పడొద్దని మంత్రి కాకాణి వ్యాఖ్యానించారు.
మరోవైపు ఇద్దరి నేతల ఆరోపణలో నిజమెంత అనేది తెలియాలంటూ పోర్టు సీఈవో అధికారికంగా మీడియా సమావేశంలో స్పష్టత ఇవ్వాలని అప్పటి వరకూ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని పలువురు చెబుతున్నారు. అంతవరకూ వేచి చూడాల్సిందే..
Read More..