Virupaksha Movie: పిల్లలకు నో ఎంట్రీ.. ఐనాక్స్ వద్ద ఉద్రిక్తత

by srinivas |   ( Updated:2023-04-22 16:13:00.0  )
Virupaksha Movie: పిల్లలకు నో ఎంట్రీ.. ఐనాక్స్ వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఐనాక్స్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ థియేటర్‌లో ‘విరూపాక్ష’ సినిమా ప్రదర్శిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు ఆన్ లైన్‌లో టికెట్లు కొనుగోలు చేశారు. సినిమా చూసేందుకు ఫ్యామిలీతో కలిసి ఐనాక్స్ వద్దకు వెళ్లారు. అయితే చిన్న పిల్లలను థియేటర్‌లోకి అనుమతించలేదు. పిల్లలకు నో ఎంట్రీ అని చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. థియేటర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. డబ్బులు పెట్టి టికెట్లు కొన్నామని ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో అన్ని వయసుల వారికి ఎంట్రీ ఉందంటూ టికెట్లు జారీ చేశారని, సినిమా చూపించకుండా డబ్బులు వాపసు ఇవ్వకపోవడంతో ఐనాక్స్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా ‘విరూపాక్ష’ సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తోంది. చిన్న పిల్లలు ఈ సినిమా చూస్తే భయపడతారని థియేటర్‌లోని అనుమతించలేదని సమాచారం.



Next Story

Most Viewed