Breaking: పిడుగుపాటుకు ఐదుగురు మృతి

by srinivas |   ( Updated:2023-04-23 12:23:27.0  )
Breaking: పిడుగుపాటుకు ఐదుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: వేసవిలో అకాల వర్షం పంట నష్టంతో పాటు ముగ్గురు ప్రాణాలను బలితీసుకున్నాయి. దీంతో రైతులతో పాటు మృతి చెందిన బాధిత కుటుంబాలు లబోదిబో మంటున్నాయి. పంట చేతికొచ్చిన సమయంలో రైతులు.. ఇంటి పెద్దని పోగొట్టుకుని కుటుంబ సభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఎవరి వైపు చూసినా విషాద ఛాయలే కనిపిస్తున్నాయి.

ఈ ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగింది. ఈ ఉదయం ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం కల్లా వర్షం విరుచుకుపడింది. అప్పటికప్పుడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పంటలన్నీ నీట మునిగాయి. అటు పిడుగులు సైతం ఉగ్రరూపం చూపించాయి. ఓవైపు వర్షం.. మరోవైపు పిడుగుల శబ్ధంతో ప్రజలు భయపడిపోయారు.

మరోవైపు అవనిగడ్డ దగ్గర ఓ రైతు పొలం పనులు చేస్తుండగా పిడుగు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే కన్నుమూశారు. చల్లపల్లిలో పిడుగుల శబ్ధంతో ఇద్దరికి గుండెపోటు వచ్చింది. వారిద్దరిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు. దీంతో ఈ ముగ్గురి కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.

గుంటూరు జిల్లాలోనూ అకాల వర్షం బీభత్సం సృష్టించింది. పత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు శ్యాంబాబు, కృపానందం మృతి చెందారు. ఆరబోసిన మిర్చిపంట కుప్పలపై పట్టలు కప్పుతుండగా పిడుగుపడింది. దీంతో శ్యాంబాబు, కృపానందం మృతి చెందారు.

Advertisement

Next Story

Most Viewed