Gannavaram vandalism caseలో ట్విస్ట్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి

by srinivas |   ( Updated:2023-02-22 13:54:01.0  )
Gannavaram vandalism caseలో ట్విస్ట్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ రిమాండ్ అంశంలో మరో ట్విస్ట్ నెలకొంది. తొలుత కోర్టు గన్నవరం సబ్‌జైలుకు పట్టాభిని తరలించాలని ఆదేశించింది. అనంతరం వాదనలు విన్న ధర్మాసనం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించేందుకు ఆదేశాలిచ్చింది. ఇకపోతే బుధవారం ఉదయం పట్టాభిని పోలీసులు గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. అదే సందర్భంలో జీజీహెచ్ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదికను కూడా పోలీసులు జడ్జికి అందజేశారు. రిపోర్టును పరిశీలించిన తర్వాత పట్టాభిని గన్నవరం సబ్ జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు.

గొడవలు చెలరేగే నేపథ్యంలో రాజమండ్రి జైలుకు తరలింపు

అయితే శాంతిభద్రతల దృష్ట్యా గన్నవరం సబ్ జైలుకు కాకుండా వేరే జైలుకు తరలించాలని పోలీసులు జడ్జిని కోరారు. ఇప్పటికే గన్నవరంలో రాజకీయంగా గొడవలు చెలరేగే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో వేరే జైలుకు తరలించాలని పోలీసులు కోరారు. గన్నవరం సబ్ జైలులో ఉంచితే జరిగే పరిణామాలపై పోలీసులు జడ్జికి వివరించారు. దీంతో టీడీపీ నేత పట్టాభిని గన్నవరం సబ్ జైలు నుండి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. కోర్టు అనుమతులతో గన్నవరం సబ్ జైలు నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పట్టాభిని తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. పట్టాభిని తరలించే సమయంలో టీడీపీ కార్యకర్తల‌ వాహనాలు వెనక రాకుండా ఉండేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే పొట్టిపాడు మరియు కలపర్రు టోల్ గేట్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Advertisement

Next Story

Most Viewed