మంత్రితో పంచాయితీ.. మైలవరం జోలికి రావొద్దంటున్న ఎమ్మెల్యే

by srinivas |
మంత్రితో  పంచాయితీ.. మైలవరం జోలికి రావొద్దంటున్న ఎమ్మెల్యే
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో ఉన్నంత వరకు తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. వైఎస్ జగన్ వెంటే నడుస్తానని తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మైలవరం నియోజకవర్గంలో అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.

అయితే తన నియోజకవర్గంలో ఎవరైనా వేలుపెడితే సహించేది లేదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలో మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును ఓడించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. మంత్రి జోగి రమేశ్‌తో ఎటువంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో వేలు పెట్టినందుకు చిన్న గ్యాప్ ఏర్పడిందని వివరణ ఇచ్చారు. గతంలో జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండటం వలన వెంటనే సమస్యలు పరిష్కరించారు.

అయితే ప్రస్తుతం మంత్రి జోగి రమేష్ ఒక్కరే జిల్లాలో మంత్రిగా ఉండటం వలన ఆయన అందరు సమస్యలు తీర్చాలని సూచించారు. రాజకీయల్లో శాశ్వత శత్రువులు ఉండరని. మంత్రి జోగి రమేశ్ నుంచి పెద్దరికం ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు..నాయకులు అందరిని కలుపుకుని పార్టీని మైలవరం నియోజకవర్గంలో అగ్రస్థానంలో నిలబెడతానని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed