Vijayawada: లెఫ్ట్ పార్టీల ధర్నా.. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు

by srinivas |
Vijayawada: లెఫ్ట్ పార్టీల ధర్నా.. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాకను నిరసిస్తూ విజయవాడలో వామపక్షాలు నిరసనకు దిగాయి. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలను అమలుపర్చ లేదని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్‌లో సీపీ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన నిరసన ధర్నా చేపట్టారు.ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story