పెనమలూరు నుంచే పోటీ చేస్తా: మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్

by srinivas |   ( Updated:2024-03-14 14:07:53.0  )
పెనమలూరు నుంచే పోటీ చేస్తా: మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్
X

దిశ, వెబ్ డెస్క్: పొత్తులల్లో భాగంగా కొందరు టీడీపీ నేతలకు సీట్లు రాకపోవడం, జనసేన అభ్యర్థులు ఖరారు కావడంతో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. ప్రధానంగా కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. పొత్తుల్లో భాగంగా ఈ రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థులకు టికెట్లు ఖరారు అయింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయాల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. తమ నేతలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. పెనమలూరు టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బోడె ప్రసాద్‌కే టికెట్ ఇవ్వాలంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించేకునే ప్రయత్నం చేశారు. దీంతో తోటి టీడీపీ కార్యకర్తలు అడ్డుకువడంతో ప్రమాదం తప్పింది.

పెనమలూరు టీడీపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు తప్ప.. ఎవరు పోటీ చేసినా తాను మాత్రం తప్పనిసరిగా బరిలోకి దిగుతానని చెప్పారు. బయటి వాళ్లు వస్తే చంద్రబాబుకు భక్తుడిగానే పోటీ చస్తానని తెలిపారు. పార్టీ మారేది లేదని.. కానీ టికెట్ కోసం పోరాటం చేస్తానన్నారు. తనకు కాకపోయినా లోకల్ నాయకులే పెనమలూరు టికెట్ ఇవ్వాలని తాను డిమాండ్ చేస్తు్న్నట్లు బోడె ప్రసాద్ తెలిపారు. పెనమలూరులో కోట్లు ఖర్చు చేసి టీడీపీని నిలబెట్టానని.. కానీ టికెట్ జనసేనకు వెళ్లిందని వాపోయారు. సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని తొలుత చెప్పారని, కాని ఇప్పుడు టికెట్ ఇవ్వలేదని బోడె ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

Read More..

ఏపీలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఖరారు.. అధికారిక ప్రకటన

Advertisement

Next Story