Fiber Net Case: దూకుడు పెంచిన సీఐడీ... ఏసీబీ కోర్టులో పిటిషన్

by srinivas |   ( Updated:2023-11-06 11:38:20.0  )
Fiber Net Case: దూకుడు పెంచిన సీఐడీ... ఏసీబీ కోర్టులో పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్: ఫైబర్ నెట్ కేసులో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టెరాసాఫ్ట్‌కు చెందిన 7 ఆస్తుల అటాచ్ మెంట్‌కు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును సీఐడీ అధికారులు కోరారు. ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఏడుగురు నిందితులకు సంబంధి రూ. 114 కోట్ల విలువైన స్థిరాస్తుల అటాచ్ మెంట్ చేయాలని సీఐడీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు అటు రాష్ట్ర హోం శాఖ ఆమోదం తెలిపింది. దీంతో సీఐడీ అధికారులు ఏడుగురు ఆస్తుల అటాచ్ మెంట్ ప్రతిపాదనకు సంబంధించి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కాగా ఏపీ ఫైబర్ నెట్‌లో భారీ స్కాం జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు హయాంలో టెర్రా సాఫ్ట్‌కి అక్రమంగా టెండర్లు ఇచ్చారని, నిబంధనలకు విరుద్ధంగా గడువు వారం రోజులు పొడిగించినట్లు సీఐడీ తేల్చింది. అంతేకాదు చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా కేసు నమోదు చేసింది. 2021లో మొత్తం 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ-1గా వేమూరి హరి ప్రసాద్, ఏ-2గా మాజీ ఎండీ సాంబశివరావు, ఏ11గా టెరా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్, ఏ25గా చంద్రబాబు పేర్లను సీఐడీ చేర్చింది. చంద్రబాబుకు వేమూరి హరిప్రసాద్ అత్యంత సన్నిహితుడు కావడంతో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ ఆరోపించింది. బ్లాక్ లిస్టులో ఉన్న టెర్రా సాఫ్ట్ కు టెండర్ దక్కేలా వేమూరి హరి ప్రసాద్ చక్రం తిప్పారని వెల్లడించింది. ఫైబర్ నెట్ ఫేజ్-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా రూ.118 కోట్లు అవినీతి జరిగిందని స్పష్టం చేసింది. టెర్రా సాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు అవకతవకలు జరిగాయని సీఐడీ తెలిపింది. అప్పటి చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్‌లో కేసులో చంద్రబాబు జైలు‌లో ఉండటంతో పీటీ వారెంట్‌పై విచారించేందుకు సీఐడీ అనుమతి కోరింది.

అంతేకాదు ఈ కేసులో నిందితులైన టెరా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ కు ఆస్తులతో పాటు పలు కంపెనీల ఆస్తులను అటాచ్ చేయాలని సీఐడీ ప్రతిపాదించింది. తుమ్మల గోపీచంద్‌తో పాటు ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్న బంగళారంలోని ఇల్లు వ్యవసాయ క్షేత్రాలు, నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకు చెందిన గుంటూరు, విశాఖలోని ఇళ్లులను ఆటాచ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేశారు.

ఇక ఫైబర్ నెట్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ బుధవారం (నవంబర్ 8న) జరగనుంది. అప్పటివరకూ చంద్రబాబును అరెస్ట్ చేయవద్దంటూ సీఐడీని సుప్రీంకోర్టు ఆదేశించింది.



Advertisement

Next Story