Vijayawada: టైమ్, డేట్ చెప్పి వెల్లంపల్లి సవాల్‌ను స్వీకరించిన డూండీ రాకేశ్

by srinivas |   ( Updated:2023-11-26 13:10:06.0  )
Vijayawada: టైమ్, డేట్ చెప్పి వెల్లంపల్లి సవాల్‌ను స్వీకరించిన డూండీ రాకేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ ఆర్య వైశ్య నాయకుల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. జగన్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు అన్యాయం జరిగిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఇందుకు దీటుగా వెల్లంపల్లి కౌంటర్ ఇస్తున్నారు. ఆర్యవైశ్యులకు తమ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని నిరూపించాలని, తాను చర్చకు సిద్ధమని వెల్లంపల్లి సవాల్ విసిరారు. ఆర్యవైశ్య సంఘాల ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయన్నారు. టీడీపీ ఆఫీసులో చర్చ పెడితే తాను వస్తానని సవాల్ చేశారు.

అయితే వెల్లంపల్లి ఛాలెం‌జ్‌ను తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ స్వీకరించారు. ఆర్యవైశ్యులకు టీడీపీ ఏం చేసిందో... జగన్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చించేందుకు తాము సైతం రెడీగా ఉన్నామని తెలిపారు. మాజీ మంత్రి వెల్లంపల్లి సవాల్‌ను తాము స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 3న విజయవాడ వన్‌టౌన్‌లోని కొత్తగుడుల కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఉదయం 11.30కు చర్చకు రావాలని రాకేశ్ పిలుపునిచ్చారు.

కొందరు వైసీపీ నాయకులు కులాల్లోనే చిచ్చులు పెడుతున్నారని డూండీ రాకేశ్ ఆరోపించారు. ముఖ్యంగా ఆర్యవైశ్యులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. వైశ్యుల్లో చీలికలు తీసుకురావాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శెట్టి, కోమటి, గుప్తలు ఆర్యవైశ్యులేనని.. వారిని విభజించడం సరికాదన్నారు. 723 కులాల పేర్లలో ఆర్యవైశ్య కులం పేరు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 14,600 మంది పేద వైశ్యులు సత్యనారాయణ వ్రతం చేసుకుందామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని డూండీ రమేశ్ ప్రశ్నించారు.

Advertisement

Next Story