- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఢిల్లీలో వైసీపీ నేతలు కారుకూతలు.. బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఢిల్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ధర్నా సందర్భంగా కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తప్పుబట్టారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో వైసీపీ నాయకులు పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో వైసీపీ నాయకులు ఐదేళ్ల పాటు ఇచ్చిమొచ్చినట్లు దోచుకున్నారని ఆరోపించారు. అందుకే కూటమి ప్రభుత్వం తరపున శ్వేతపత్రాలు విడుదల చేశామని చెప్పారు. అవినీతిపై విచారణ చేపడతామని, నిందితులు కఠినంగా శిక్షిస్తామని ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు.
Next Story