Mlc Elections: విజయవాడ, హైదరాబాద్‌లో భారీగా బెట్టింగులు

by srinivas |   ( Updated:2023-03-23 12:01:18.0  )
Mlc Elections: విజయవాడ, హైదరాబాద్‌లో భారీగా బెట్టింగులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఒక స్థానంలో వైసీపీ, టీడీపీ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. టీడీపీకి బలం లేకున్నా అభ్యర్థిని బరిలో దింపింది. అయితే టీడీపీ గెలవాలంటే ఆ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లతో పాటు మరో మూడు కావాలి. అందులో రెండు ఓట్లు వైసీపీ రెబల్స్ నుంచి వచ్చే అవకాశాలున్నాయి. మరో ఓటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు క్రాస్ ఓటింగ్ జరగకుండా వైసీపీ పటిష్ట చర్యలు చేపట్టింది.

ఈ ఎన్నికల్లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 7 స్థానాలకు గాను 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అసెంబ్లీలో వైసీపీకి 149 మంది ఎమ్మెల్యేలు+ నలుగురు టీడీపీ, ఒకరు జనసేన ఎమ్మెల్యే బలం ఉంది. అటు టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు+ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది.

అయితే ఒక్కో ఎమ్మెల్సీ గెలుపునకు 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ మాత్రమే ఉందనుకున్నా.. ఇంకో ఎమ్మెల్యే ఓటు కావాలి. క్రాస్ ఓటింగ్‌పై టీడీపీ ఆశలు పెట్టుకుంది. సీఎం జగన్‌పై ఉన్న వ్యతిరేకత వల్ల తమకు ఓటు వచ్చే అవకాశం ఉందని, కచ్చితంగా తాము గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో గెలుపోటములపై బెట్టింగులు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. విజయవాడతో పాటు హైదరాబాద్‌లో బెట్టింగులు నడుస్తున్నాయి. బెట్టింగ్ రాయుళ్లు లక్షల్లో పందేలు కాసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాసేపట్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుతుందో.

Advertisement

Next Story