- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijayawada: ‘మోదానీ’ పుస్తకావిష్కరణ.. అదానీ అక్రమాలపై సీపీఎం ఆగ్రహం
దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ అంతర్జాతీయ ఆర్థిక నేరగాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు ఆరోపించారు. అదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదానీకి అప్పగించిన గంగవరం పోర్టుతోపాటు ఇతర పోర్టులు, భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అదానీ అక్రమాలపై ఈ నెల 14వ తేదీ నుండి 22 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోడీ, అదానీ అక్రమాలపై సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రచురించిన ‘మోదానీ’ పుస్తకాన్ని శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబూరావు, రమాదేవితో కలిసి వీ శ్రీనివాసరావు ఆవిష్కరించారు.
మోదీ ప్రోద్బలంతో అదానీ దేశ సంపద లూఠీ
ఈ సందర్బంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మోదీ ప్రోద్బలంతో అదానీ దేశ సంపదను లూఠీ చేశారని, అనతి కాలంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంపన్నుడిగా ఎదిగాడని ఆరోపించారు. అదానీ అక్రమాలకు కేంద్రంలో మోదీతోపాటు రాష్ట్రంలో జగన్ కూడా సహకరించారని, ప్రభుత్వ ఆస్తిగా ఉన్న గంగవరం పోర్టు వాటాలను కూడా కారుచౌకగా కట్టబెట్టారని ధ్వజమెత్తారు. అంతేకాదు కృష్ణపట్నం పోర్టు, సోలార్ ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో వేల ఎకరాలు అదానీకి అప్పగిస్తున్నారని శ్రీనివాసరావు మండిపడ్డారు.
గంగవరం పోర్టులో బలవంతంగా కార్యకలాపాలు
అలాగే విశాఖ పోర్టు నుండి ఎగుమతి, దిగుమతులు అయ్యే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కార్యకలాపాలను బలవంతంగా గంగవరం పోర్టు నుంచి చేయిస్తున్నారని చెప్పారు. గంగవరం పోర్టు భద్రతాపరంగానూ కీలకమైందని, ఇక్కడ అదానీ కార్యకలాపాల వల్ల దేశ భద్రతకూ ముప్పు వస్తుందని చెప్పారు. ఇప్పటికే ముంద్రా పోర్టులో పెద్దఎత్తున డ్రగ్స్‌తో సహా వేలకోట్ల అక్రమ వ్యాపారాలు సాగుతున్నాయని చెప్పుకొచ్చారు. అదానీకి రాష్ట్రంలో పెద్దఎత్తున ఎందుకు ప్రాజెక్టులు కట్టబెడుతున్నారో ముఖ్యమంత్రి జగన్ కూడా వివరణ ఇవ్వాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మరోవైపు విశాఖలో జరుగుతున్న గ్లోబర్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 బోగస్ అని విమర్శించారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుండి ఎన్ని కంపెనీలు తెచ్చారు...ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అనే అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులను మోసం చేయడానికి, ప్రలోభాలకు గురిచేసేందుకే గ్లోబర్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 ఏర్పాటు చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు ఆరోపించారు.