Ap News: మద్యం తాగించి, డ్రగ్ ఇంజెక్షన్ ఇచ్చి విద్యార్థినిపై అత్యాచారం?

by srinivas |   ( Updated:2023-06-19 10:39:54.0  )
Ap News: మద్యం తాగించి, డ్రగ్ ఇంజెక్షన్ ఇచ్చి విద్యార్థినిపై అత్యాచారం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. హాస్టల్ విద్యార్థినిపై వైసీపీ కార్యకర్త లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతుంది. మచిలీపట్నం 13వ డివిజన్‌లోని ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినిపై వైసీపీ కార్యకర్త ఆవుల సతీష్ లైంగిక దాడికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హాస్టల్ విద్యార్థినికి మద్యం తాగించి, డ్రగ్ ఇంజెక్షన్ ఇచ్చి సతీష్ అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హాస్టల్ విద్యార్థినిని బైక్‌పై సతీశ్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రాత్రి సమయానికి తీసుకొచ్చి హాస్టల్ వద్ద వదిలేసి సతీష్ వెళ్లిపోయాడు.

అయితే హాస్టల్‌కి వచ్చిన తర్వాత బాధిత విద్యార్థిని నీరసంగా కనిపించారు. కనీసం స్పృహలో కూడా లేకపోవడంతో స్నేహితులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధిత విద్యార్థినికి వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారానికి గురైనట్లు డాక్టర్లు నిర్ధారించారని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు ఆవుల సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రస్తావించారు. మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఏకంగా టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ కేసును మాఫీ చేసేందుకు వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారని ఆరోపించారు. ఇంత ఘోరం జరిగినా ఇంకా పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అనేదానిపై ఇప్పటికీ వివరణ ఇవ్వడం లేదని కొల్లు రవీంద్ర ఆరోపించారు.

Advertisement

Next Story