- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోడికత్తి కేసు: జగన్ వాంగ్మూలం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు..న్యాయవాది సలీం
దిశ , డైనమిక్ బ్యూరో : విశాఖపట్నం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో శుక్రవారం కోడి కత్తి కేసుపై విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న ప్రత్యేక కోర్టు డిసెంబర్ 15కి విచారణను వాయిదా వేసింది. నిందితుడు శ్రీనివాస్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. మరోవారం రోజుల్లో బెయిల్ పిటిషన్‌పై తీర్పు వస్తుందని విశాఖ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విచారణకు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇరు వాదనలు విన్న ప్రత్యేక కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 15కు వాయిదా వేసింది. అనంతరం నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ తరఫు న్యాయవాది సలీం మీడియాతో మాట్లాడారు. కోడికత్తి వంటి కేసుల్లో ఐదేళ్ల శిక్ష పడటం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు అని చెప్పుకొచ్చారు. ఈకేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు సీఎం జగన్ ముందుకు రావడం లేదని ఆరోపించారు. రాజకీయ కోణం వల్లే ఈ కేసు ఇన్నేళ్లు సాగుతోందని అభిప్రాయపడ్డారు. మరోవైపు హైకోర్టు ఇచ్చిన 8 వారాల స్టే రద్దు కోసం పిటిషన్ వేస్తాం అని నిందితుడు శ్రీనివాస్ తరఫు న్యాయవాది సలీం వెల్లడించారు.