Ap రాజకీయాల్లో కీలక ట్విస్ట్.. పవన్‌తో సై.. చంద్రబాబుతో నై

by srinivas |   ( Updated:2022-11-17 15:06:23.0  )
Ap రాజకీయాల్లో కీలక ట్విస్ట్.. పవన్‌తో సై.. చంద్రబాబుతో నై
X

దిశ వెబ్ డెస్క్: ఏపీ (Ap)లో మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ (Ycp) ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ (Bjp), టీడీపీ (Tdp), జనసేన(Janasena) కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్ర బీజేపీ మాత్రం జనసేనతో కలిసే ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని చెబుతోంది.


కానీ ఇటీవల పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీతో కలిసి జనసేన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ వ్యాఖ్యల్లో అర్ధమైంది. అంతేకాదు టీడీపీ, బీజేపీ, జనసేన కలుస్తాయని ఇన్ డైరెక్ట్‌గా హింట్ ఇచ్చినట్లుగా అయ్యాయి.

అయితే ఇటీవల జరిగిన పరిణామాలు కూడా ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికలు వెళ్తాయనే ప్రచారానికి ఊపునిచ్చాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ప్రధాని మోదీ (Pm Modi)ని చంద్రబాబు కలిశారు.


ఆ తర్వాత ఇప్పటంలో జరిగిన ఘటనలతో పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు (Chandrababu) భేటీ అయ్యారు. ఆ తర్వాత ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు రావడంతో ఆయనను పవన్ కల్యాణ్ కలిసి ఏకాంతంగా చర్చించడం వంటి పరిణాలు జరిగాయి.


అయితే ప్రధాని మోదీతో పవన్ భేటీ పలు ప్రచారాలకు తావిచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కోసమే భేటి జరిగినట్లు ఊహాగానాలకు తెరలేపాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పోత్తు పెట్టుకోబోతున్నాయని.. అందుకు మోదీ, పవన్ భేటీనే వేదిక కానుందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత అంతా కామ్ అయిపోయింది.


అయితే ఏపీ బీజేపీ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేసింది. కుటుంబపాలనకు తాము వ్యతిరేకమని చెబుతోంది. 2024లో జనసేనతోనే కలిసి ఎన్నికలు వెళ్తామని అంటోంది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతోనే తమ మైత్రి ఉంటుందని, టీడీపీతో కలిసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్‌కు కూడా ఢిల్లీ పెద్దలు చెప్పారని తెలిపారు. జనసేన తమతోనే ఉంటుందని.. పవన్ కల్యాణ్‌ను ఒప్పిస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాశంగా మారాయి.

కాగా 2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఏపీలో అధికారంలోకి వచ్చాయి. తెలంగాణలో కొన్ని సీట్లు గెలుచుకున్నాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ ఒంటరిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయ ఢంకా మోగించింది. ప్రస్తుతం ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్నా.. .జగన్ సర్కార్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. దీంతో వచ్చే ఎన్నికలపై దృష్టి సారించాయి. ఎవరికి వాళ్లు ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహ రచనలు చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే సోము వీర్రాజు మాత్రం బీజేపీ-జనసేన ఒక్కటిగా ఎన్నికలకు వెళ్తాయని చెబుతున్నారు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం ఎక్కడా పొత్తులు గురించి ప్రస్తావించలేదు. ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి తర్వాత ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడితే రాజకీయ పరిణామాలు మారే అవకాశం లేకపోలేదు. బీజేపీ అగ్రనేతలు తీసుకునే నిర్ణయం మేరకే రాష్ట్ర నేతలు అడుగులు వేయాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి..

ఇవి కూడా చదవండి:

Chandra Babu Naidu.. ఈ జన్మలో మళ్లీ సీఎం కాలేవు...Vijaya Sai Reddy

Advertisement

Next Story

Most Viewed