వైసీపీ ర్యాలీలో జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, ఫొటోలు కలకలం

by srinivas |   ( Updated:25 April 2024 10:18 AM  )
వైసీపీ ర్యాలీలో జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, ఫొటోలు కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలో జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. వైసీపీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు తెలుపుతున్నట్లు ఈ ఫెక్సీలు, ఫొటోలు దర్శమిచ్చాయి. కృష్ణా జిల్లా పెనమలూరులో మంత్రి జోగి రమేశ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో జూ. ఎన్టీఆర్ ఫెక్సీలు కనిపించాయి. గురువారం కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొడాలి నాని నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ ర్యాలీలోనూ జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. కొడాలి నాని ఫ్లకార్డుల్లో ఎన్టీఆర్ ఫొటోలు దర్శనమిచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో పెనమలూరు, గుడివాడలో జూ. ఎన్టీఆర్ ఫోటో, ఫ్లెక్సీల రాజకీయం ఆసక్తికరంగా మారింది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed