- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:‘ఎన్ని కేసులు పెట్టినా భయపడను’..విచారణ అనంతరం జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్:మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు మాజీ మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణ అనంతరం జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తానని తెలిపారు. కేవలం నిరసన తెలిపేందుకు మాత్రమే తాను చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లానని జోగి రమేష్ చెప్పారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు సూపర్ సిక్స్ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారని చూస్తుంటే..చంద్రబాబు, లోకేష్ మాత్రం రెడ్ బుక్ అమలు చేసే పనిలో ఉన్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. తనపై చంద్రబాబు కక్ష సాధింపులకు దిగారని అన్నారు. తన కుమారుడిని కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.