Ongole RIMS: ఒంగోలు రిమ్స్​లో ఉద్యోగాలు.. అటెండర్, టెక్నీషియన్​ పోస్టులు

by Anil Sikha |
Ongole RIMS: ఒంగోలు రిమ్స్​లో ఉద్యోగాలు.. అటెండర్, టెక్నీషియన్​ పోస్టులు
X

దిశ, డైనమిక్​ బ్యూరో : ఒంగోలు రిమ్స్​(RIMS) లో కాట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్ (outsourcing)​ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (AP HEALTH MEDICAL & FAMILY WELFARE DEPARTMENTనోటిఫికేషన్ జారీ చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పటల్‌, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, ప్రభుత్వ నర్సింగ్ స్కూల్‌లో 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో 2, జనరల్ ఆసుపత్రిలో 24, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో 7, స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో 10 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 4 పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిలోనూ, 39 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్దతిలోనూ భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 20వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

పోస్టులు ఖాళీలు జీతం

జనరల్ డ్యూటీ అటెండర్/ ఆఫీస్ సబార్డినేట్ 7 రూ.15,000

ఆడియోమెట్రీ టెక్నీషియన్ 1 రూ.32,670

డార్క్ రూమ్ అసిస్టెంట్‌ 1 రూ.18,500

డయాలసిస్ టెక్నీషియన్ 1 రూ.32,670

ఈసీజీ టెక్నీషియన్ 1 రూ.32,670

ఎలక్ట్రీషియన్ / మెకానిక్ 1 రూ.18,500

ఎఫ్ఎన్‌వో 4 రూ.15,000

జూనియర్ అసిస్టెంట్ / కంప్యూటర్ అసిస్టెంట్‌ 4 రూ.18,500

ల్యాబ్ అటెండెంట్ 4 రూ.15,000

ఎంఎన్‌వో 3 రూ.15,000

మార్చురీ అటెండర్‌ 1 రూ.15,000

ఆప్టోమెట్రిస్ట్ 1 రూ.37,640

ప్యాకర్ 1 రూ.15,000

ప్లంబర్‌ 1 రూ.18,500

రేడియోగ్రాఫర్ 1 రూ.35,570

స్పీచ్ థెరిపిస్ట్‌ 1 రూ.40,970

స్ట్రెచర్ బేరర్ / బాయ్ 1 రూ.15,000

థియేటర్ అసిస్టెంట్‌/ ఒ.టి అసిస్టెంట్‌ 5 రూ.15,000

టైపిస్ట్/ డీఈవో 1 రూ.18,500

రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ 1 రూ.61,960

హౌస్ కీపర్‌/వార్డెన్స్‌ 2 రూ.18,500

దరఖాస్తు చేయడం ఎలా?

దరఖాస్తు ఫారమ్ ను అధికార వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు విద్యార్హతలు, ఉద్యోగ అనుభవాలతో కూడిన ఒక జిరాక్స్ కాపీ సెట్‌పై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించాలి. మార్చి 20 తేదీ సాయంత్రం 5 గంటలలోపు ప్రిన్సిపల్‌, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా కు పంపాలి. పోస్టు లేదా వ్యక్తిగతంగా వెళ్లి అయినా సమర్పించవచ్చు, మార్చి 21 నుంచి ఏప్రిల్ 7 వరకు దరఖాస్తులు పరిశీలిస్తారు. ఏప్రిల్​9న మెరిట్​లిస్టు విడుదల చేస్తారు. ఎంపికైన వారి జాబితా ఏప్రిల్ 30న విడుదల చేస్తారు.

అర్హతలు

2025 జనవరి 1 నాటికి వయస్సు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగు అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. అయితే 52 ఏళ్ల వయస్సు దాటకూడదు. అప్లికేషన్ ఫీజు ఓసీ అభ్యర్థులకు రూ.300 ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు అభ్యర్థులకు రూ.200 ఉంటుంది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి..: hhttps://prakasam.ap.gov.in/recruitment/

Next Story