Jawahar Reddy is news chief secretary of Andhra Pradesh

by srinivas |   ( Updated:2022-11-28 10:26:17.0  )
Jawahar Reddy is news chief secretary of Andhra Pradesh
X

దిశ వెబ్ డెస్క్: ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. అధికారికంగా సోమవారం ఉత్తర్వులు జారీ చేయనుంది. 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి. డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర కొత్త ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. దీంతో జవహర్‌రెడ్డిని సీఎం జగన్ నియమించారు. ఏడాదిన్నర పాటు సీఎస్‌గా జవహర్‌రెడ్డి కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన పని చేస్తున్నారు.


Next Story