- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking: మూడో భార్యకు పవన్ కల్యాణ్ విడాకులు..? క్లారిటీ ఇచ్చిన జనసేన

దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల పూజలు చేశారు. వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. ఈ ఫొటోలను జనసేన పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
కాగా కొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ త్వరలో మంగళగిరి వెళ్లనున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ దంపతులు విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి జనసేన చెక్ పెట్టింది. దీంతో పవన్ దంపతులు పూజలు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పవన్ దంపతులు విడిపోతున్నారంటూ చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫొటోలు చూసైనా మారండంటూ కామెంట్స్ పెడుతున్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా… pic.twitter.com/x3WJ5iUtQv
— JanaSena Party (@JanaSenaParty) July 5, 2023
- Tags
- Telugu News